Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. డెన్మార్క్‌లో ఉద్యోగాలకు కొత్త దారి!

Denmark offers good news and new job paths for Indians
Advertisement
  • 2027 జనవరి 1 నుంచి కొత్త విధానం అమలు
  • 16 దేశాల పౌరులకు ఉద్యోగ అవకాశం
  • కనీస వార్షిక వేతనం రూ.47.27 లక్షలు
  • రెండేళ్ల అనుభవం ఉన్న సంస్థలకే అవకాశం
  • యూరప్‌లో భారతీయ నిపుణులకు మరో కొత్త మార్గం
Advertisement
విదేశాల్లో ఉద్యోగం కోసం చూస్తున్న భారతీయులకు డెన్మార్క్‌ కీలక అవకాశం కల్పించనుంది. విదేశీ నిపుణులను నియమించుకునేందుకు కొత్త ఇమ్మిగ్రేషన్‌ మార్గాన్ని ఆ దేశం తీసుకురానుంది. ఇందులో భారతీయులకు కూడా అవకాశం ఉండనుంది. 2027 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది.

కొత్త విధానం కింద డెన్మార్క్‌లోని ఎంపిక చేసిన సంస్థలు 16 దేశాలకు చెందినవారిని ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జపాన్‌, సింగపూర్‌, బ్రిటన్‌, అమెరికా తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.

అయితే ఈ అవకాశం అన్ని సంస్థలకు అందుబాటులో ఉండదు. డెన్మార్క్‌లో కనీసం రెండేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ అయి ఉండాలి. కనీసం 10 మంది పూర్తికాల ఉద్యోగులు ఉండాలి. సంబంధిత సామూహిక కార్మిక ఒప్పందం పరిధిలో ఉండాలి. డెన్మార్క్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారుల వద్ద నమోదు చేసుకుని అర్హత ధ్రువీకరణ పొందాలి.

ఈ విధానం కింద నియమితులయ్యే విదేశీ ఉద్యోగులకు కనీస వార్షిక వేతనం 3,22,000 డానిష్‌ క్రోనర్‌గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.47.27 లక్షలు. డెన్మార్క్‌లో అమల్లో ఉన్న కొన్ని ఇతర ఉద్యోగ ఆధారిత వీసా మార్గాలతో పోలిస్తే ఈ వేతన పరిమితి తక్కువగా ఉంది.

విదేశాల నుంచి నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకోవడంలో డెన్మార్క్‌ సంస్థలకు ఈ కొత్త విధానం మరింత వెసులుబాటు కల్పించనుంది. భారతీయ నిపుణులకు యూరప్‌లో ఉద్యోగ అవకాశాలను పెంచే మార్గంగా ఇది నిలవనుంది.
Advertisement
Advertisement
Denmark
Denmark Job Opportunities
Indian Professionals
Denmark Immigration Policy
Work Visa Denmark
Denmark Foreign Workers

More Telugu News